జిల్లా సమగ్ర శిక్షకార్యాలయము, గుంటూరు నందు గల MIS& Planning Co-Ordinator (MIS) మరియు Assistant Statistical Officer (ASO)-01 పోస్టునకు deputation on ఫారెన్ సర్వీస్ టర్మ్స్ మరియు నిబంధనలను అనుసరించి పనిచేయుటకు, నోటిఫికేషన్ తేదీ నాటికి 55 సంవత్సరముల లోపు వయస్సు కలిగి, పాఠశాల సబ్జెక్టులు కలిగి, గుంటూరు జిల్లా నందలి ప్రభుత్వ పాఠశాలలో /జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో/ మున్సిపల్ మేనేజ్ మెంట్ యందు పని చేయుచూ, QUALIFICATIONS కలిగియున్న School Assistants,SGT నుండి దరఖాస్తులు ఆహ్వానించడమైనది. పూర్తిచేసిన దరఖాస్తులను ది: 14 -05-2025 నుండి ది: 16 -05-2025 సాయంత్రము 05.00 గం.లలోపు జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయము, గుంటూరు నందు గల జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయము నందు అన్ని విద్యార్హతా నకలు ధ్రువ పత్రములతో మరియు ఇతర నకలు ధ్రువ పత్రములతో వారు పనిచేయుచున్న అధికారి వారితో సంతకము చేయించి అందజేయవలసినదిగా తెలియ జేయడమైనది. పూర్తి వివరములకు samagrashikshaguntur. blogspot.com వెబ్ సైట్ నందు లేదా ఈ కార్యాలయము నందు సంప్రదించగలరు.
జిల్లా విద్యాశాఖాధికారి, ఎక్స్ అఫీసియో ప్రాజెక్టు కో-ఆర్డినేటర్,సమగ్ర శిక్ష, గుంటూరు.
The
eligibility & qualifications for the post of Planning & MIS Co- Ordinator,ASO as shown below:
No comments:
Post a Comment