సమగ్ర శిక్షా గుంటూరు

Monday, December 21, 2020

📚✍'నాడు-నేడు'తో స్కూళ్లలో అద్భుత అభివృద్ధి✍📚

📚✍'నాడు-నేడు'తో స్కూళ్లలో అద్భుత అభివృద్ధి✍📚 • ఏపీ పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ సభ్యులు • గుంటూరులోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల సందర్శన 'మన బడి నాడు-నేడు' పథకం ద్వారా ప్రభుత్వ స్కూళ్లలో అద్భుతమైన అభివృద్ధి జరిగిందని ఏపీ పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ సభ్యులు ప్రొఫెసర్ వి.నారాయణరెడ్డి, సీఏవీ ప్రసాద్ బి.ఈశ్వరయ్య పేర్కొన్నారు గుంటూరు నగరంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలను వారు శనివారం ఆకస్మికంగా సందర్శించారు . ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు ఉచితంగా నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క విషయంలోనూ రాజీ పడకుండా నిధులు కేటాయిస్తోందన్నారు, మొదటి దశ అభివృద్ధి పనులు విజయవంతంగా పూర్తయ్యా యని.. రెండు, మూడు దశల్లో మరో 30 వేల పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా ప్రభుత్వం తీర్చిదిద్దనుందని తెలిపారు. పాఠ్యాంశాల రూపకల్పనలో సైతం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుందన్నారు. కమిషన్ సభ్యులతో పాటు ఆర్జేడీ కె.రవీంద్రనాథ్ రెడ్డి, డీఈవో గంగా భవాని తదితరులున్నారు.

22 నుంచి గణిత దినోత్సవ పోటీలు

22 నుంచి గణిత దినోత్సవ పోటీలు జాతీయ గణిత దినోత్సవం సంద ర్భంగా 9,10 తరగతుల విద్యార్థులకు ఈ నెల 22న వివిధ రకాల పోటీలు నిర్వహించనున్నట్లు డీఈఓ తెలిపారు. పోటీలు డివిజన్ స్థాయిలో డిప్యూటీ డీఈఓల నేతృత్వంలో జరుగుతాయన్నారు ప్రతి డివిజన్ నుంచి అత్యుత్తమ గణిత నమూనాలను ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. 30న డివిజన్ స్థాయి విజేతలకు రెండు అంశాల్లో ఎస్ఈఆర్టీ, ఇబ్రహీం పట్నంలో పోటీలు నిర్వహిస్తామని తెలిపారు.

📚✍ సహ పాఠ్యబోధన కార్యక్రమాలు✍📚

📚✍ సహ పాఠ్యబోధన కార్యక్రమాలు✍📚 విద్యార్థుల వికాసానికి దోహదపడేలా సోమవారం నుంచి ఈ నెల 31 వరకూ పాఠశాలల్లో సహపాఠ్య బోధన కార్య క్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఆటలు, పాటలు, క్రీడలు, భాషాభివృద్ధి, నాట్య ప్రదర్శన, పద్యవినోదం తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అలాగే విద్యార్థులకు జిల్లా స్థాయిలో తెలుగు, హిందీ, ఇంగిష్ వ్యాసరచన పోటీలు, సదస్సులు, నాటకం, ఏకపాత్రాభినయం అభ్యసన పోటీలు నిర్వహించనున్నారు. దీం తోపాటు అన్ని పాఠశాలల్లోనూ ఈ నెల 23 నుంచి 31 వరకూ ఫిట్ ఇండియా స్పోర్ట్స్ డే వంటి ప్రత్యేక కార్యక్రమాలు జరుపుతారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల, మండల స్థాయిల్లో ఆటల పోటీలు నిర్వహిస్తారు. మండల స్థాయిలో గెలు పొందిన విద్యార్థులకు బహుమలు ఇస్తారు.

భాషా ఉత్సవాలు ✨గుంటూరుజిల్లా సమగ్రశిక్ష✨

నేటి నుండి భాషా ఉత్సవాలు ✨గుంటూరుజిల్లా సమగ్రశిక్ష✨ జిల్లాలోని మండల స్థాయిలో 'విద్యార్థి వికాసం'లో భాగంగా ఈ నెల నుంచి 31 వరకు భాషోత్సవం నిర్వహించాలని డీఈఓ ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయు లను ఆదేశించారు. మండల స్థాయిలో భాషోత్సవం, క్రీడోత్సవాలను నిర్వహించాల న్నారు. మండల స్థాయిలో అన్ని ప్రభుత్వ పాఠశా లల విద్యార్థులు పాల్గొనేలా చూడాలన్నారు. 21 తేదీల్లో వ్యాసరచన, 28, 24 తేదీల్లో రోల్ఫప్లే 26, 27 తేదీల్లో భాషా క్రీడలు, 29, 29 తేదీల్లో పద్య క్రీడలు, 30, 31 తేదీల్లో పఠన, రాత పోటీలు నిర్వహించాలన్నారు. వీటిని ఎలిమెంటరీ స్థాయి సెకెండరీ స్థాయిల్లో నిర్వహించాలన్నారు. ప్రతి యాక్టివిటీని డాక్యుమెంటరీల రూపంలో నమోదు చేయాలన్నారు. పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృ తీయ స్థానాల్లో నిలిచిన విజేతలకు బహుమతులు సర్టిఫికెట్లు ప్రదానం చేయాలన్నారు. మార్గదర్శకాలు. ప్రాథమిక, సెకండరీ, సీనియర్ సెకండరీ పాఠశాల, కళాశాలలలో 21.12.2020 నుండి 31.12. 2020 తేదీ వరకు భాషా ఉత్సవాలను 2020-21 జరిపించాలి.ఈ కార్యక్రమం నిర్వహణకు మండల స్థాయిలో విద్యాశాఖాధికారి గారి అధ్యకతన ఒక మండల కమిటీ ఏర్పాటు చేయాలి. ఇందులో అందరూ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు మరియు భాషా ఉపాధ్యాయులు కూడా ఉంటారు.మండల కమిటీ కార్యక్రమంను విజయవంతంగా నిర్వహించుటకు బడ్జెట్ కు అనుగుణంగా ప్రణాళిక చేసుకోవచ్చును. ప్రతీ మండలానికి భాషా ఉత్సవాల నిర్వహణకు అమౌంట్ ఇవ్వబడుతుంది.కావున ఒక బ్యానర్ మరియు విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, బహుమతులు, స్నాక్స్, మంచి నీరు ఇవ్వవలసి ఉంది. రోజువారీ కార్యక్రమం: 21.12.20 :పాఠశాల స్థాయిలో వ్యాస రచన పోటీలు జరిపించాలి. 22.12.20 : మండల స్థాయిలో వ్యాస రచన పోటీలు 23.12.20: పాఠశాల స్థాయిలో నాటికలు పోటీలు 24.12.20 మండల స్థాయిలో నాటిక పోటీలు 26.12.29:పాఠశాల స్థాయిలో భాషా క్రీడలు 27.12.20: మండల స్థాయిలో భాషా క్రీడలు 28.12.20 పాఠశాల స్థాయిలో పద్యాల పోటీలు 29.12.20 మండల స్థాయిలో పద్యాల పోటీలు 30.12.20 పాఠశాల స్థాయిలో చదవడం, రాయడం పోటీలు 31.12.20 మండల స్థాయిలో చదవడం, రాయడం పోటీలు విద్యార్థులు ఇంటి వద్ద నుండి కూడా పోటీలో పాల్గొనవచ్చును. వారు రాసిన పత్రాలను ఉపాధ్యాయులు గాని, CRP లు గాని తీసుకొని మండల స్థాయి పోటీలకు పంపించవచ్చును. మండల విజేతలను ప్రతీ అంశమునకు సంబందించి ముగ్గురిని బహుమతులుకు ఎంపిక చేయాలి. ప్రాథమిక స్థాయి (1 నుండి 8 తరగతులు) నుండి ముగ్గురు, సెకండరీ స్థాయి 9 వ తరగతి నుండి 12 వ తరగతి వరకు ముగ్గుర్ని విజేతలుగా ప్రకటించి సర్టిఫికెట్స్, బహుమతులు ఇవ్వాలి. విజేతల పేర్లు,ఫొటోస్, వీడియోస్ ప్రతీ రోజూ సాయంత్రానికి జిల్లాకు పంపించాలి. ప్రతీ పాఠశాల నుండి తప్పనిసరిగా ప్రాతినిధ్యం ఉండాలి. ఉపాధ్యాయులు అందరూ బాధ్యత వహించి విద్యార్థులకు సూచనలు ఇవ్వాలి. పోటీలలో COVID నిబంధనలు పాటించాలి. శానిటైజర్ లు, మాస్కులు ఉండాలి. ఈ కార్యక్రమ నిర్వహణకు ప్రతి మండలానికి నిధులు కేటాయించడం జరిగింది. పైన పేర్కొన్న షెడ్యూల్ ప్రకారం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గౌరవ DEO గారు మరియు APC గారు ఆదేశించారు. ఇట్లు, విద్యా విషయక పర్యవేక్షణ విభాగం సమగ్ర శిక్ష, గుంటూరు.

Thursday, December 17, 2020

Aptitude test (TAMANNA )

 Aptitude test (TAMANNA )

 
సమగ్రా శిక్ష గుంటూరు-నాణ్యమైన విద్య - గుంటూరు జిల్లాలోని సెకండరీ & సీనియర్ సెకండరీ పాఠశాలల్లో ఆప్టిట్యూడ్ టెస్ట్
రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్, ఎపిఎస్ఎస్, మరియు అమరావతి జిల్లాలోని అన్ని జిల్లా విద్యాశాఖాధికారులు మరియు 
మండల్ విద్యాశాఖాధికారులకు తమన్నా (ప్రయత్నించండి మరియు 
కొలత ఆప్టిట్యూడ్ మరియు సహజ సామర్థ్యాలు) ఆప్టిట్యూడ్ పరీక్షను పాఠశాల స్థాయిలో సెకండరీ & సీనియర్
 సెకండరీ పాఠశాలల కోసం పాఠశాల స్థాయిలో అమలు చేయాలని ఆదేశించారు. రాష్ట్రం. 
ఆప్టిట్యూడ్ టెస్ట్ అమలు కోసం ఈ క్రింది మార్గదర్శకాలతో 2020-21 సంవత్సరంలో అన్ని ప్రభుత్వ నిర్వహణ పాఠశాల 
ఉపాధ్యాయులలో 9 వ తరగతి నుండి 12 వ తరగతి వరకు అమలు చేయాలి.

VIDYARDHI VIKASAM

                                       VIDYARDHI VIKASAM
సమగ్రా శిక్ష గుంటూరు-సిమాట్-PAB 2021-21- ప్రాథమిక మరియు మాధ్యమిక పాఠశాలల్లో విద్యార్ధి వికాసం (చైల్డ్ హోలిస్టిక్ డెవలప్‌మెంట్) అనే వినూత్న కార్యక్రమాల అమలు - భాషా ఉత్సవం మరియు జాతీయ క్రీడా దినోత్సవం షెడ్యూల్ మరియు మార్గదర్శకాలు జారీ చేయబడ్డాయి.
ప్రభుత్వ ఎలిమెంటరీ, సెకండరీ మరియు సీనియర్ సెకండరీలో నిర్వహిస్తున్న విద్యార్ధి వికాసం (చైల్డ్ హోలిస్టిక్ డెవలప్‌మెంట్) 
యొక్క క్వాలిటీ కాంపోనెంట్ కింద ఎంహెచ్‌ఆర్‌డి, భారత ప్రభుత్వం బడ్జెట్‌ను ఆమోదించింది మరియు 
PAB 2020-21 MINUTES LO  కమ్యూనికేట్ చేసినట్లు స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్, ఎపిఎస్ఎస్ మరియు అమరావతి సమాచారం ఇచ్చారు. 
గుంటూరు జిల్లాలోని విద్యార్ది వికాసం కార్యక్రమం కింద విద్యార్థులకు, అభిజ్ఞా, శారీరక, సామాజిక, మానసిక శ్రేయస్సు కోసం
 వివిధ కార్యకలాపాల కోసం గుంటూరు జిల్లాలోని పాఠశాలలు.