సమగ్ర శిక్షా గుంటూరు
Monday, December 21, 2020
భాషా ఉత్సవాలు ✨గుంటూరుజిల్లా సమగ్రశిక్ష✨
నేటి నుండి భాషా ఉత్సవాలు
✨గుంటూరుజిల్లా సమగ్రశిక్ష✨
జిల్లాలోని మండల స్థాయిలో 'విద్యార్థి వికాసం'లో భాగంగా ఈ నెల నుంచి 31 వరకు భాషోత్సవం నిర్వహించాలని డీఈఓ ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయు లను ఆదేశించారు. మండల స్థాయిలో భాషోత్సవం, క్రీడోత్సవాలను నిర్వహించాల న్నారు. మండల స్థాయిలో అన్ని ప్రభుత్వ పాఠశా లల విద్యార్థులు పాల్గొనేలా చూడాలన్నారు. 21 తేదీల్లో వ్యాసరచన, 28, 24 తేదీల్లో రోల్ఫప్లే 26, 27 తేదీల్లో భాషా క్రీడలు, 29, 29 తేదీల్లో పద్య క్రీడలు, 30, 31 తేదీల్లో పఠన, రాత పోటీలు నిర్వహించాలన్నారు. వీటిని ఎలిమెంటరీ స్థాయి సెకెండరీ స్థాయిల్లో నిర్వహించాలన్నారు. ప్రతి యాక్టివిటీని డాక్యుమెంటరీల రూపంలో నమోదు చేయాలన్నారు. పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృ తీయ స్థానాల్లో నిలిచిన విజేతలకు బహుమతులు సర్టిఫికెట్లు ప్రదానం చేయాలన్నారు.
మార్గదర్శకాలు.
ప్రాథమిక, సెకండరీ, సీనియర్ సెకండరీ పాఠశాల, కళాశాలలలో 21.12.2020 నుండి 31.12. 2020 తేదీ వరకు భాషా ఉత్సవాలను 2020-21 జరిపించాలి.ఈ కార్యక్రమం నిర్వహణకు మండల స్థాయిలో విద్యాశాఖాధికారి గారి అధ్యకతన ఒక మండల కమిటీ ఏర్పాటు చేయాలి. ఇందులో అందరూ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు మరియు భాషా ఉపాధ్యాయులు కూడా ఉంటారు.మండల కమిటీ కార్యక్రమంను విజయవంతంగా నిర్వహించుటకు బడ్జెట్ కు అనుగుణంగా ప్రణాళిక చేసుకోవచ్చును.
ప్రతీ మండలానికి భాషా ఉత్సవాల నిర్వహణకు అమౌంట్ ఇవ్వబడుతుంది.కావున ఒక బ్యానర్ మరియు విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, బహుమతులు, స్నాక్స్, మంచి నీరు ఇవ్వవలసి ఉంది.
రోజువారీ కార్యక్రమం:
21.12.20 :పాఠశాల స్థాయిలో వ్యాస రచన పోటీలు జరిపించాలి.
22.12.20 : మండల స్థాయిలో వ్యాస రచన పోటీలు
23.12.20: పాఠశాల స్థాయిలో నాటికలు పోటీలు
24.12.20 మండల స్థాయిలో నాటిక పోటీలు
26.12.29:పాఠశాల స్థాయిలో భాషా క్రీడలు
27.12.20: మండల స్థాయిలో భాషా క్రీడలు
28.12.20 పాఠశాల స్థాయిలో పద్యాల పోటీలు
29.12.20 మండల స్థాయిలో పద్యాల పోటీలు
30.12.20 పాఠశాల స్థాయిలో చదవడం, రాయడం పోటీలు
31.12.20 మండల స్థాయిలో చదవడం, రాయడం పోటీలు
విద్యార్థులు ఇంటి వద్ద నుండి కూడా పోటీలో పాల్గొనవచ్చును. వారు రాసిన పత్రాలను ఉపాధ్యాయులు గాని, CRP లు గాని తీసుకొని మండల స్థాయి పోటీలకు పంపించవచ్చును. మండల విజేతలను ప్రతీ అంశమునకు సంబందించి ముగ్గురిని బహుమతులుకు ఎంపిక చేయాలి.
ప్రాథమిక స్థాయి (1 నుండి 8 తరగతులు) నుండి ముగ్గురు, సెకండరీ స్థాయి 9 వ తరగతి నుండి 12 వ తరగతి వరకు ముగ్గుర్ని విజేతలుగా ప్రకటించి సర్టిఫికెట్స్, బహుమతులు ఇవ్వాలి. విజేతల పేర్లు,ఫొటోస్, వీడియోస్ ప్రతీ రోజూ సాయంత్రానికి జిల్లాకు పంపించాలి.
ప్రతీ పాఠశాల నుండి తప్పనిసరిగా ప్రాతినిధ్యం ఉండాలి. ఉపాధ్యాయులు అందరూ బాధ్యత వహించి విద్యార్థులకు సూచనలు ఇవ్వాలి.
పోటీలలో COVID నిబంధనలు పాటించాలి. శానిటైజర్ లు, మాస్కులు ఉండాలి.
ఈ కార్యక్రమ నిర్వహణకు ప్రతి మండలానికి నిధులు కేటాయించడం జరిగింది.
పైన పేర్కొన్న షెడ్యూల్ ప్రకారం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గౌరవ DEO గారు మరియు APC గారు ఆదేశించారు.
ఇట్లు,
విద్యా విషయక పర్యవేక్షణ విభాగం
సమగ్ర శిక్ష,
గుంటూరు.
Subscribe to:
Post Comments (Atom)
In language games which games will play
ReplyDeleteWhich games are playing in language games
ReplyDeletePromotion of Languages
DeleteTesting pronunciation abilities
Samethalu
Padyala Poorana
Chatuvu Padyalu
This comment has been removed by the author.
ReplyDelete