సమగ్ర శిక్షా గుంటూరు

Monday, December 21, 2020

📚✍'నాడు-నేడు'తో స్కూళ్లలో అద్భుత అభివృద్ధి✍📚

📚✍'నాడు-నేడు'తో స్కూళ్లలో అద్భుత అభివృద్ధి✍📚 • ఏపీ పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ సభ్యులు • గుంటూరులోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల సందర్శన 'మన బడి నాడు-నేడు' పథకం ద్వారా ప్రభుత్వ స్కూళ్లలో అద్భుతమైన అభివృద్ధి జరిగిందని ఏపీ పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ సభ్యులు ప్రొఫెసర్ వి.నారాయణరెడ్డి, సీఏవీ ప్రసాద్ బి.ఈశ్వరయ్య పేర్కొన్నారు గుంటూరు నగరంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలను వారు శనివారం ఆకస్మికంగా సందర్శించారు . ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు ఉచితంగా నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క విషయంలోనూ రాజీ పడకుండా నిధులు కేటాయిస్తోందన్నారు, మొదటి దశ అభివృద్ధి పనులు విజయవంతంగా పూర్తయ్యా యని.. రెండు, మూడు దశల్లో మరో 30 వేల పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా ప్రభుత్వం తీర్చిదిద్దనుందని తెలిపారు. పాఠ్యాంశాల రూపకల్పనలో సైతం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుందన్నారు. కమిషన్ సభ్యులతో పాటు ఆర్జేడీ కె.రవీంద్రనాథ్ రెడ్డి, డీఈవో గంగా భవాని తదితరులున్నారు.

No comments:

Post a Comment