సమగ్ర శిక్షా గుంటూరు

Thursday, August 20, 2026

నాన్-రెసిడెన్షియల్ సీజనల్ హాస్టళ్ల నిర్వహణకు దరఖాస్తుల ఆహ్వానం

 

నాన్-రెసిడెన్షియల్  సీజనల్ హాస్టళ్ల నిర్వహణకు దరఖాస్తుల ఆహ్వానం

సమగ్ర శిక్ష, గుంటూరు ఆధ్వర్యంలో 2026–27 విద్యా సంవత్సరానికి బీహార్, ఒడిశా, యు.పి , మరియు ఝార్ఖండ్ రాష్ట్రాలనుండి గుంటూరు కు వచ్చిన అంతర్రాష్ట్ర వలస కార్మికుల పిల్లలకు  మనరాష్ట్రం లో ఇతర జిల్లాలనుండి వచ్చిన వలస కార్మికుల పిల్లలకు  వారి మాతృభాష లో  విద్యా అవకాశాలు కల్పించడం, బాల కార్మికత్వాన్ని నిరోధించడం మరియు పిల్లల నిరంతర విద్యను కొనసాగించడం లక్ష్యంగా, గుంటూరు మిర్చి యార్డ్ మరియు కోల్డ్ స్తోరేజిలలో  మిరపకాయలు సంబంధిత పనులు  మరియు ఇతర సీజనల్  పనులు జరుగుతున్న ప్రాంతాల్లో (వర్క్ సైట్ ల వద్ద)   నాన్-రెసిడెన్షియల్ సీజనల్ హాస్టళ్ల నిర్వహణకు అర్హత కలిగిన స్వచ్చంద సంస్థల నుండి స్వయం సహాయక సంఘాల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి.

  • దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 20.08.2026     
  •  దరఖాస్తుల స్వీకరణ ముగింపుతేదీ: 25.08.2026,సాయంత్రం 5 గంటల్లోపు
  • సమర్పించవలసిన కార్యాలయం: జిల్లా ప్రాజెక్టు కోఆర్డినేటర్, సమగ్ర శిక్ష, గుంటూరు జిల్లా.