సమగ్ర శిక్షా గుంటూరు

Thursday, June 19, 2025

                                                         పత్రికా ప్రకటన

సమగ్ర శిక్ష ప్రాజెక్టులో విధులు నిర్వహిస్తూ... వైద్య, స్పౌజ్, ఇతర వ్యక్తిగత కారణాలతో బదిలీలకు విజ్ఞప్తి చేసుకున్న ఒప్పంద, పొరుగు సేవల సిబ్బం దికి ప్రభుత్వం అవకాశం కల్పించిం దని, వారంతా బదిలీలకు దర ఖాస్తు చేసుకోవాలని జిల్లా సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు సమన్వయ కర్త  శ్రీమతి ఐ. పద్మావతి బుధవారం  తెలిపారు.  సమగ్ర శిక్ష ప్రాజెక్టులో ఒప్పంద, పొరుగు సేవల సిబ్బందైన ఐఈఆ ర్పీలు, పీటీఐలు, సీఆర్ఎంటీలు, మండల స్థాయి అకౌంటెంట్లు, సైట్ ఇంజినీర్లు, ఎంఐఎస్ సమన్వయక ర్తలు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు. మెసేంజర్లు, ఆఫీస్ సబార్డినేట్లతో పాటు ఇతర సిబ్బంది తమ ధ్రువీ కరణ పత్రాలను మండల విద్యాశా ఖాధికారి 1, 2 లతో సంతకం చేయించి ఈ నెల 21 వ  సాయంత్రం 5 గంటల్లోపు గుంటూరు లోని  సమగ్ర శిక్ష ప్రాజెక్టు జిల్లా కార్యాలయంలో అందజేయాలని ఆమె కోరారు. వీటికి సంబంధించి అదనపు సమాచారం కోసం https://samagrashikshaguntur.blogspot.com/  ను   సందర్శించవలెను